TG : సిద్దిపేట జిల్లాలోని రాజకీయాలు పక్కనపెట్టి, ప్రాజెక్టులు నింపండి: హరీశ్

TG : సిద్దిపేట జిల్లాలోని రాజకీయాలు పక్కనపెట్టి, ప్రాజెక్టులు నింపండి: హరీశ్
X

నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి మిడ్ మానేరు నుంచి వాటికి నీటిని పంపింగ్ చేసేలా అధికారులను ఆదేశించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కు ఆయన లేఖ రాశారు. వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీరు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అందులో పేర్కొన్నారు.

‘గతేడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు ఉన్నాయి. రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకుగాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్నసాగర్‌లో 18 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సాగు నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నీటిని పంపింగ్ చేసేలా అధికారులను ఆదేశించాలి. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను’ అని లేఖలో హరీశ్ పేర్కొన్నారు.

Tags

Next Story