TG : ఎమ్మెల్యేల అనర్హతపై కేసీఆర్ కు ఎదురుదెబ్బ.. ఆ ఎమ్మెల్యేలు సేఫ్?

TG : ఎమ్మెల్యేల అనర్హతపై కేసీఆర్ కు ఎదురుదెబ్బ.. ఆ ఎమ్మెల్యేలు సేఫ్?
X

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు వారాల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకటరావు పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. అనర్హత విషయంలో నెలరోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది.ఈ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది. అనర్హత నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజుల్లో తీసుకోవాలి అనేది అసెంబ్లీ స్పీకర్ విచక్షణాధికారం అని.. ఇందుకు ఇంత టైం అంటూ ఏమీ లేదంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్ణత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసిన.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. పై విధంగా తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి సమయం.. గడువు లేదని.. టైం బాండ్ అంటూ లేదంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది హైకోర్టు బెంచ్.

Tags

Next Story