Mohan Babu : రంగారెడ్డి కోర్టులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ

Mohan Babu : రంగారెడ్డి కోర్టులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ
X

సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మంచు మనోజ్ పైన మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టును తప్పుదోవపట్టించారంటూ కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో పత్రాలను అందజేశారు. దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా తప్పిదానికి పాల్పడిన కోర్టు క్లర్క్ కు న్యాయస్థానం మెమో జారీ చేసింది.

మరోవైపు మంచు ఫ్యామిలీ ఆస్తులకు సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మంచుమోహన్ బాబు, మంచు విష్ణు ఒకటిగా ఉండగా... మంచు మనోజ్ మాత్రం ఒంటరిగానే పోరాడుతున్నారు. జల్పల్లిలోని నివాసానికి సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. తన ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిచాలంటూ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా మంచు మనోజు నోటీసులు వెళ్లాయి. మనోజ్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.

తాజాగా జల్పల్లిలోని నివాసం వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. జల్పల్లి నివాసంలోకి తనను రానీయడం లేదంటూ ఇంటి వద్ద కూర్చుని మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags

Next Story