TG : తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. రాత్రిపూట ఈ జిల్లాలు జాగ్రత్త

TG : తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. రాత్రిపూట ఈ జిల్లాలు జాగ్రత్త
X

తెలంగాణను చలి వణికిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణుకుతున్నారు. ముఖ్యంగా తెలం గాణలోని అటవీ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 6 డిగ్రీల మేర పడిపోతున్నాయి. మరీముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో చలి తగ్గే అవకాశం ఉన్నా ఆ అల్పపీడన ప్రభావం తెలంగాణపైపెద్దగా ఉండదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో రానున్న నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత తెలంగాణ వ్యాప్తంగా మారింత పెరగనుందని హెచ్చరిం చింది. ప్రస్తుతం సాధారణం కన్నా 4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. తెలంగాణ కశ్మీర్ గా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. సాధారణం కన్నా 6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో చలి తీవ్రత సాధారణ

Tags

Next Story