TG : రేవంత్, భట్టికి షాక్.. ఉత్తమ్ తో హైకమాండ్ భేటీ

TG : రేవంత్, భట్టికి షాక్.. ఉత్తమ్ తో హైకమాండ్ భేటీ
X

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లో ఊహించని పరిణామం ఎదురైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ ఉన్నా కూడా హైకమాండ్ మిగతా సీనియర్లతో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ రహస్యంగా భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏకాంతంగా ఎందుకు భేటీ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీ వేణుగోపాల్‌ .. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఏం చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story