Hyderabad : ఖజానా జ్యువెలరీలో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దోపిడీకి ప్రయత్నించిన దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు.ఈ రోజు ఉదయం (ఆగస్టు 12, 2025). షాపు తెరిచిన కొన్ని నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ఆరుగురు దుండగులు ముసుగులు ధరించి షాపులోకి చొరబడ్డారు. తుపాకులు చూపించి లాకర్ తాళాలు ఇవ్వాలని సిబ్బందిని బెదిరించారు. సిబ్బంది ప్రతిఘటించడంతో, దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో షాపులోని డిప్యూటీ మేనేజర్ కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దుండగులు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి, కొంత మొత్తంలో వెండి ఆభరణాలను దోచుకుని పారిపోయారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో చందానగర్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దోపిడీ దొంగలు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com