CM Revanth Reddy : రాళ్లకు, గుట్టలకూ రైతుభరోసా ఇద్దామా?: సీఎం రేవంత్

సాగులో లేని భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ‘రూ.22వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు అందింది. రోడ్లు వేసిన భూములకూ డబ్బులు పడ్డాయి. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా?’ అని అసెంబ్లీలో ఎమ్మెల్యేలను అడిగారు. రైతుభరోసాపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందరికీ ఇస్తాం’ అని వెల్లడించారు.
బీఆర్ఎస్ సర్కారు 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి సర్కారుపై భారం మోపిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘వీళ్లను ఉరి తీసినా తప్పులేదు. అనేక బ్యాంకులు 2 నుంచి 4శాతానికి అప్పులిస్తుంటే వీళ్లు 11.5శాతానికి అప్పు తెచ్చారు. రూ.వేలాది కోట్లు వడ్డీలు కడుతున్నాం. ఇతర దేశాల్లో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు. దుబాయ్‌లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపి ఉండేవారు’ అని మండిపడ్డారు.
రైతులకు మేలు చేసేలా బీఆర్ఎస్ సూచనలు చేస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు మాత్రమే సభకు వస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com