Shyamala : బెట్టింగ్ విచారణకు హాజరైన శ్యామల

Shyamala : బెట్టింగ్ విచారణకు హాజరైన శ్యామల
X

హైకోర్టు ఆదేశాలతో వైసీపీ మహిళా నేత, యాంకర్ శ్యామల హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు ఎందుకు ప్రమోషన్ చేశారు.. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించారని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు విచారించారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు మియాపూర్ కేసులో మొదటగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మధ్యవర్తులను విచారించే అవకాశం ఉంది.

Tags

Next Story