Venkatrami Reddy : సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న వార్తల్లో వాస్తవం లేదు..!

Venkatrami Reddy : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. అధికారిగా ఉంటే కొన్ని పరిమితులు ఉంటాయని... అదే ప్రజా ప్రతినిధిగా ఉంటే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో కృషి చేస్తోందని, అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అన్నారు. రాష్ట్రాఅభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి... 1991లో గ్రూప్ ఒన్ అధికారిగా ప్రభుత్వ విధుల్లో చేరారు. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆయన ఆర్డీఓగా పని చేశారు. మెదక్ డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి, సిద్ధిపేట కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com