జనం లాక్డౌన్ పాటిస్తున్నారా.. పోలీసులు డ్యూటీ ఎలా చేస్తున్నారు.. డౌట్ వచ్చిన సారు..

జనం లాక్డౌన్ పాటిస్తున్నారా.. పోలీసులు డ్యూటీ ఎలా చేస్తున్నారు.. డౌట్ వచ్చిన సారు..
అది కాదు సారు మా అయ్యకు మందులు కావాల్న. అందుకే బయటకు వచ్చిన అని సర్ధి చెప్పడం.. మరో చోట బండి ఆపిన పోలీసుతో..

ఏంటి సామి.. ఎక్కడికి వెళ్తున్నావ్.. లాక్డౌన్ అని తెల్వదా.. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మీ ప్రాణాలు కాపాడ్డం కోసం మా ప్రాణాలు అడ్డు పెట్టి డ్యూటీ చేస్తుంటే కొంచెం కూడా సపోర్ట్ చెయ్యరా.. పోలీసులు ఆ పెద్దాయన్ని దబాయించి అడుగుతున్నారు.

అది కాదు సారు మా అయ్యకు మందులు కావాల్న. అందుకే బయటకు వచ్చిన అని సర్ధి చెప్పడం.. మరో చోట బండి ఆపిన పోలీసుతో.. ఎందుకు బండి ఆపిన్రు.. మంత్రి నాకు తెలుసు కావాలంటే పీఏకి ఫోన్ చేసి మాట్లాడండి అంటూ ఓ చెక్ పోస్ట్ దగ్గర దర్పం ప్రదర్శిస్తే.. ఎవరికైనా చెప్పండి.. మా డ్యూటీ మేం చేయాల అని ఆ పెద్దాయనతో పోలీసుల ఆర్గ్యుమెంట్.

ఇంతకీ ఇదంతా ఓ సామాన్య వ్యక్తి చేసిన పని కాదు సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్ నగరంలో లాక్డౌన్ ఎలా అమలవుతుందో గమనించేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఓ పాత మోటర్ బైక్ తీసుకుని, తలపాగా చుట్టుకున్నారు ఎస్పీ.

ఏమాత్రం గుర్తుపట్టకుండా ముఖాన్ని కవర్ చేసుకున్నారు. బండి మీద ఊరంతా చక్కర్లు కొట్టారు. అనంతరం పోలీసులు తమ డ్యూటీ బాగా చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుగు ప్రయాణంలో రుమాలు లేకుండా వచ్చిన ఎస్పీని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

Tags

Read MoreRead Less
Next Story