CM Revanth : సిగాచీ కంపెనీ ప్రమాదం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం రేవంత్.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తాజాగా ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది.
సీఎస్‌ఐఆర్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి. ప్రతాప్‌కుమార్, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పుణెకి చెందిన భద్రతాధికారి సంతోష్ ను నియమించారు. ప్రమాదం ఎలా జరిగింది..? భద్రతా ప్రమాణాలు పాటించారా..? ఇందులో కంపెనీ నిర్లక్ష్యం ఉందా.? అనేది ఈ కమిటీ తేల్చనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com