Bandi Sanjay : తెలంగాణకు భారీగా నిధుల కేటాయింపు : బండి సంజయ్

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. దేశంలో తెలంగాణ సహా వెనుక బడిన 150 జిల్లాల అభి వృద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతోందన్నారు. శాఖల వారీగా బడ్జెట్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పొందు పర్చింది అనాటి యూపీఏ ప్రభుత్వమైతే... దానికి వంతపాడింది కేసీఆర్ అనే విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు బండి సంజయ్. దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చేన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తీరుతుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పదేళ్లలో ఏ సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పొందుపర్చిన యూపీఏ సర్కార్, వంతపాడిన కేసీఆర్.. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశాన్ని ఎందుకు ఆ చట్టంలో ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మీడియా ప్రకటనలకే తప్ప పరిమితమయ్యారే తప్ప కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం కనీస ప్రయత్నం చేయలేదని. విమర్శించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లో భాగంగా మరిన్ని నిధులు రానున్నాయన్నారు సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com