MLC Kavitha : అన్నను విష్ చేసిన చెల్లి.. సింపుల్ గా..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ చెపుతున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆయన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కవిత రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేసీఆర్ దేవుడు అని ..కానీ ఆయన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని... పార్టీ లో కోవర్టుల రాజ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే ఈ వ్యాఖ్యలు కేటీఆర్ ను ఉద్దేశించే చేశారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది..ఈ నేపథ్యంలో అన్న చెల్లెలి మధ్య గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈరోజు కేటీఆర్ బర్త్ డే కావడం తో తన ఎక్స్ ఖాతాలో అన్న కేటీఆర్ ను విష్ చేశారు చెల్లెలు కవిత."అన్నయ్య.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!" అని సింపుల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. దీనికి కేటీఆర్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ తో తమకు విబేధాలు లేవని చెప్పకనే చెప్పారు కవిత.. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com