Singareni : వరద బాధితులకు సింగరేణి సాయం .. రూ.10.25 కోట్ల విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు విరాళం చెక్కును గురువారం సచివాలయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎం బలరాం, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు సీఎం రేవంత్‌కు చెక్కును అందజేశారు. వరద తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించామన్నారు. గతంలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు సైతం విరాళాలు అందించడంపై సీఎం రేవంత్, డెప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మక్కన్ సింగ్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, లక్ష్మీపతి గౌడ్, రాజ్ కుమార్, త్యాగరాజన్, సింగరేణి జీఎంలు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com