Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్‌కి సిట్ నోటీసులు.. ఎందుకంటే!

Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్‌కి సిట్ నోటీసులు.. ఎందుకంటే!
X

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో సహా పలువురు పోలీసు అధికారులు, ఇతర వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల్లో బండి సంజయ్ కూడా ఒకరని సిట్ గుర్తించింది. గతంలో, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆరోపణలకు సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడానికి సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అంటే, ఈ కేసులో సాక్షిగా ఆయన వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. సిట్ నోటీసుల మేరకు జూలై 24, 2025న హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపినట్లు సమాచారం.

Tags

Next Story