TG : స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభం.. రేవంత్ టార్గెట్ ఏటా 3 లక్షల మందికి పట్టాలు

TG : స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభం.. రేవంత్ టార్గెట్ ఏటా 3 లక్షల మందికి పట్టాలు
X

తెలంగాణలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ను సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఏటా 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారని సీఎం గుర్తు చేశారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదన్నారు. దీని తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

Tags

Next Story