TG : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి నెల నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన జారీ చేశారు. తెలంగాణలోని అన్ని రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు, ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 20వేల కోట్లతో ధాన్యం సేకరణ లక్ష్యంగా ఎంచుకోగా, ఈ సీజన్ లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయంతో పేద ప్రజల మద్దతు కూడగట్టుకోవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి నిరుద్యోగ సమస్యకు శుభం కార్డు వేసే ప్రయత్నాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్ కార్డులు అందలేదని, తమ ప్రభుత్వ హయాంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com