Bhatti Vikramarka : సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సోలార్ ప్రాజెక్టు : డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సోలార్ పవర్ ను అప్పగిస్తామని, వ్యవసాయానికి ఉపయోగపడేలా 1000 మెగా వాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ విషయంలో త్వరలోనే కొత్త స్కీం అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే విద్యుత్ శాఖ, పంచాయితీ రాజ్ లు ఎంఓయూ కూడా చేసుకున్నాయన్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆయన భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న న్యూ ఎనర్జీ పాలసీ, పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో సోలార్ విద్యుత్ పై ఫోకస్ చేశామన్నారు.. కుసుం సీ పథకం కింద లక్ష సోలార్ పంపు సెట్లను గిరిజనులకు అందిస్తామన్నారు. 4 వేల మెగావాట్లతో సోలార్ పవర్ లో భాగంగా ఈ లో రైతులకు పెద్ద ఎత్తున సోలార్ పంపులు పెట్టిం చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 'ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అం దించాల్సిందిగా కోరాం. దీనికి కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. విద్యుత్ సంస్కరణల విషయంలో తెలంగాణ ప్రభుత్వా న్ని కేంద్రం అభినందించింది. ' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com