ఎస్పీబీ విగ్రహంపై ఎందుకీ రచ్చ..?

ఎస్పీబీ విగ్రహంపై ఎందుకీ రచ్చ..?
X

గానగంధర్వుడు, వేల పాటలు పాడిన సింగర్.. కోట్లాదిమంది అభిమానులున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయిన తర్వాత ఆయన విగ్రహంపై వివాదం నడుస్తోంది. బాలసుబ్రమణ్యం బతికి ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదంలో ఎప్పుడు పడలేదేమో. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పిబి విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయహే పాటను పాడమంటే వ్యతిరేకించాడని.. తాను సమైక్యవాదుడిని అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి విగ్రహాన్ని ఎలా పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే చోట అందెశ్రీ, గద్దర్ లాంటి విగ్రహాలు పెట్టాలని.. ఏపీలో కూడా వాళ్ల విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.

నిజమే వాళ్ళు అన్నట్టు అక్కడ అందెశ్రీ విగ్రహం పెట్టాలి.. గద్దర్ విగ్రహం పెట్టాలి ఇటు ఏపీలోనూ పెట్టాల్సిందే. ఎందుకంటే కళాకారులకు ప్రాంతం, కులం, మతం అనేవి ఉండవు. కళాకారులు ఎన్నడో సరిహద్దులు దాటేశారు. సప్త సముద్రాలను దాటేసి ప్రపంచమంతా ఖ్యాతి సంపాదించుకుంటున్నారు. ఎక్కడో పుట్టి పెరిగిన మైకేల్ జాక్సన్ కు ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే కల ఏ స్థాయిలో ప్రపంచాన్ని చుట్టేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా ఒక ప్రాంతీయత అనేది లేదు. ఎందుకంటే ఆయన దేశంలోని దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడాడు. దేశమంతా కాదు ప్రపంచమంతా ఆయనకు అభిమానులు ఉన్నారు. తమిళనాడు నుంచి ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత తమిళనాడులో ఒక వీధికి ఆయన పేరు పెడితే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెళ్లి ఓపెన్ చేశారు.

కర్ణాటకలో కూడా ఎస్పీబీ పేరు మీద వీధులు ఉన్నాయి. ఇలా ఎస్పీబీని అన్ని రాష్ట్రాల వాళ్ళు తమ మనిషిగా చూస్తున్నారు కాబట్టి.. ఆయనకు ప్రాంతీయతను అంటగట్టడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొందరు న్యూట్రల్ గా ఉన్నారు. ఏపీ తెలంగాణ కలిసి ఉండాలని కోరుకున్న వారిలో ఎస్పీబీ కూడా ఉన్నారేమో. అది తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినట్లు కాదు. ఆయన ఎక్కడ అలా చెప్పలేదు కూడా. తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన వాళ్ళ విగ్రహాలు లేవా. రవీంద్ర భారతికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు కదా. తెలంగాణ ఎప్పుడూ కళాకారులను ఎంతో గౌరవిస్తుంది. అందుకే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎస్పీబీ విగ్రహం పెట్టడానికి ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఎవరైనా రాజకీయం చేస్తున్నారేమో అనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా సరే కళాకారులకు ప్రాంతీయతను అంటగట్టకుండా అందర్నీ సమానంగా గౌరవిస్తేనే బాగుంటుంది.


Tags

Next Story