Komurelli Temple : మహాశివరాత్రికి కొమురెల్లి క్షేత్రం ముస్తాబు.. స్పెషల్ పూజలు ఇవే

కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమయిన శ్రీ మల్లి ఖార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గర్భాలయంలో మహాన్యాస పూర్వక అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తోటబావి ప్రాంగణంలో యాదవ సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచవర్ణాలతో పెద్దపట్నం వేసి స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజున మల్లన్న ఆలయంలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహిస్తారు 46 వరుసలతో పంచ రంగులతో పసుపు, కుంకుమ, తెల్ల పిండి , పచ్చ సునేరుతో ఓగ్గు పూజారులు పట్నాన్ని వేస్తారు ఈ పట్నాన్ని శివసత్తులు మల్లన్న భక్తులు పట్నాన్ని తొక్కి వాళ్ల భక్తిని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణం లో ఉన్న గంగరేణి చెట్టు వద్ద భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి ఓడి బియ్యం పోసి డప్పు చప్పుళ్లతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆలయ పరిసరాలను స్వాగత తోరణాలతో విద్యుత్ దీపాలతో రక రకాల రంగుల లైట్లతో రాజా గోపురాన్ని అలంకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com