Konda Surekha : మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు...మంత్రి కొండా సురేఖ రివ్యూ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేయండి.. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు.. ఈ విషయంలోని ర్లక్ష్యం వహిస్తే ఉరుకునేది లేదు కఠిన చర్యలు తప్పవ్ తగిన ఏర్పాట్లు చేయండి.. భక్తులకు మెరుగైన సౌ కర్యాలను కల్పిస్తే మనకు పుణ్యం వస్తది.. దానితో పాటుగా ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. ' అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో సచి వాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలు వివరాలపై అధికారులను ఆరా తీశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ, భద్రకాళీ, కాళేశ్వరం తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాది శివరాత్రి నిర్వ హణ అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా క్యూ మేనేజ్మెంట్, మంచినీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వాహనాల పార్కింగ్, ఆరుబ యట ప్రదేశాల్లో చలువ పందిళ ఏర్పాటుతో పాటు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలని అధికా రులను ఆదేశించారు. మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయ క్షేత్రాలకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకో వాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని మొయిన్చౌర స్తాల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కా ర్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడీష నల్ కమిషనర్ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com