TG : నాగార్జున సాగర్‌కు స్పెషల్ బస్సులు ఇవే

నాగార్జున సాగర్ అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకుల తాకిడి పెరిగింది. కానీ హైదరాబాద్ నగరానికి శ్రీశైలం కంటే సాగర్ సమీపంలో ఉండటంతో ఎక్కువ మంది పర్యాటకులు సాగర్ వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి టీజీ ఆర్టీసీ శుభవార్త అందించింది.
నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి నేరుగా సాగర్కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. నల్గొండ డిపో పరిధిలో నడిచే ఈ సర్వీసులు.. ఉదయం 5.00, 6.45, 7.15, 7.30, 8.00, 9.45, 10.45 నిమిషాలకు.. తరువాత మధ్యాహ్నం 2.30 మరియు సాయంత్రం 5.00 5.40 గంటలకు డీలక్స్ బస్సులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి నేరుగా సాగర్ కు వెళ్తాయి.
సాగర్ వెళ్లాలనుకునే సందర్శకులు టీజీ ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సుఖంగా, సురక్షితంగా ప్రయాణం సాగించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. వరద పోటెత్తడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ క్రస్టు గేట్లను ఎత్తడంతో అక్కడ అందాలను వీక్షించేందుకు జనాలు క్యూ కడుతున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com