స్పెషల్ హెలికాఫ్టర్లు తెప్పించాలి.. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి

స్పెషల్ హెలికాఫ్టర్లు తెప్పించాలి.. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి
X

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. ఆదివారం నల్గొండ దేవరకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లు తెప్పించాలని, పూర్తిగా నిండిన చెరువులు కాలువలు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు కలెక్టర్ల కు ప్రభుత్వం నిధుల‌ను అప్పగించాలని హరీశ్ రావు సూచించారు.

Tags

Next Story