TG : 10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు

రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని స్పెషల్ ఆఫీసర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్ జిల్లా బాధ్యతలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమప్రాలికి అప్పగించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలను సురేంద్ర మోహన్‌కు ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఇలంబర్తి, కరీంనగర్‌కు ఆర్వీ కర్ణన్, నల్గొండకు అనితా రామచంద్రన్, రంగారెడ్డికి డీ దివ్య, నిజామాబాద్‌కు ఏ శరత్, మహబూబ్‌నగర్‌కు రవి, వరంగల్‌కు టీ వినయ్ కృష్ణారెడ్డి, ఉమ్మడి మెదక్‌కు హరిచందనను నియమించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ పరిశీలను సమర్థవంతంగా చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 238 ప్రాంతాల్లో నిర్వహించబోయే క్షేత్రస్థాయి పరిశీలనను ఈ ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేస్తారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com