Delhi : బీసీ పోరుగర్జనకు హైదరాబాద్ నుండి ప్రత్యేక రైలు

Delhi : బీసీ పోరుగర్జనకు హైదరాబాద్ నుండి ప్రత్యేక రైలు
X

ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగబోయే బీసీల పోరుగర్జన మహా ధర్నాకు సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వేస్టేషన్ నుండి ప్రత్యేక రైలు బయలుదేరింది. చర్ల పల్లి రైల్వేస్టేషన్లో ఉదయం 10 గంటలకు బయలుదేరిన ప్రత్యేక రైలును జెండా ఊపి జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అన్ని బీసీ కులాలకు చెందిన వేలాది మంది బీసీ శ్రేణులు ఒక్కటై బీసీ ఉద్యమానికి మద్దతునిస్తూ పయనమయ్యారు. పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదిస్తే రెండున విజయోత్సవ సభ నిర్వహిస్తాం... లేదంటే దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుడతామని నినాదంతో ఏకమయ్యారు. బీసీ ఉద్యమ చరిత్రలో మొదటిసారి ప్రత్యేక రైలులో వేలాదిమందితో ఢిల్లీకి వెళ్లి చరిత్ర సృష్టించబోతున్నామని జాజుల శ్రీనివాస్ తెలిపారు.

Tags

Next Story