Sabarimala Special Trains : హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప దర్శనం కోసం శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ – కొట్టాయం (07133) మధ్య డిసెంబర్ 5, 12, 19, 26 మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయానికి రైలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొట్టాయం – కాచిగూడ (07134) రైలు 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి.. ఆ తర్వాతి రోజున రాత్రి 11.40 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుతుంది. బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, యాద్గిర్, కృష్ణా, రాయ్‌చూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచులు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com