Kukatpally : ముగ్గురి ప్రాణం తీసిన కల్తీ కల్లు

Kukatpally : ముగ్గురి ప్రాణం తీసిన కల్తీ కల్లు
X

కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య 3కి చేరింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు, ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి చనిపోయాడు. మృతులను సీతా రామ్ (47), బొజ్జయ్య (55), నారాయణ మ్మ (65)గా పోలీసులు గుర్తించారు. వీరింతా హెచ్ఎంటీ హిల్స్ సాయిచరణ్ కాలనీకి చెందిన వారిగా నిర్ధారించారు. కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి నిన్న 19 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇందులో 15 మంది ( శ్రీశైలం, యాదగిరి, కాలేశ్వరరావు, మాధవి, కో టేశ్వరరావు, పెంటేష్, పోచమ్మ, లక్ష్మి, మౌనిక, దేవదాస్, రాములు, గోవిందమ్మ, మనప్ప, నరసింహ, యెబు) పంజాగుట్ట నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ ను సీజ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటివి రిపీట్ కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా..ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Next Story