ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, కుటుంబ సభ్యులు

స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌లో బాలకృష్ణ, రామకృష్ణ, సుహాసిని సహా కుటుంబ సభ్యులంతా పూలమాలలు వేసి, అన్నగారిని స్మరించుకున్నారు. ఆ ప్రాంతమంతా జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో మార్మోగింది.
పేదల జీవితాల్లో ఎన్టీఆర్ వెలుగులు నింపారని బాలకృష్ణ అన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం, ఇళ్ల నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన చంద్రబాబు, లోకేశ్.. నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు. సమాజహితం కోసం పనిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com