Shrithej Health Condition : వెంటిలేటర్ పైకి శ్రీతేజ్.. వాతావరణ మార్పులతో విషమించిన ఆరోగ్యం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా మారింది. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత రెండు రోజుల నుంచి శ్రీతేజ్‌కి మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతోందని వైద్యులు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైందని చెప్పారు. PCR నివేదిక ప్రకారం, అతని యాంటీబయాటిక్స్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అతని నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని వైద్యులు తెలిపారు. పైప్ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామన్నారు. ఎడమ వైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్లో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com