TG : కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్‌లు

TG : కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్‌లు
X

కేబీఆర్ పార్క్ చుట్టూ నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందుల్ని త్వరితగతిన తగ్గించే ఏర్పాట్లలో రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి కీలక జంక్షన్లల్లో యుద్ధప్రాతిపదికన వంతెనలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇందులో భాగంగా.. కీలక జంక్షన్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా స్టీల్ బ్రిడ్జీలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే డిజైన్లు సైతం సిద్ధం చేయగా.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం ఇప్పటికే భూమి పరీక్షలు కూడా నిర్వహించారు.

Tags

Next Story