HYDRA : హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు : సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అలాంటి వారి భరతం పట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.. కూల్చకుండా, కూలుస్తామని భయపెడుతూ కొందరు భారీగా వసూళ్లు చేస్తున్నారని తనకు అనేక ఫిర్యాదు అందాయని ఆయన పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన రేవంత్ గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరు వసూళ్లకు పాల్పడినా తాట తీసుడే అన్ని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com