MLC Kavitha : కగార్ ఆపరేషన్ నిలిపేయండి : కవిత

మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్పులు, ఎదురుకాల్పులతో కల్లోలిత ప్రాంతాలు తల్లడిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలున్న ఎన్ కౌంటర్లు ఎందుకని ఆమే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్నించారు. సోమవారం కల్వకుంట్ల కవిత తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను తక్షణం నిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర కోరారు. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్తో ప్రజలు ఆందోళనలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించాలని సూచించారు కవిత. శాంతి చర్చలకు సిద్ధమని ఇప్పటికే మా వోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలని సూచిం చారు. మావోయిస్ట ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ప్రభుత్వం సలహాలు, సూచనలు తీసుకోవాలని, కేవలం చర్చలతోనే శాంతిని నెలకొల్పడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వపు విధానం సరికాదని సూచించారు. ప్రజాస్వామ్యబ ద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేకమంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో చత్తీస్ గఢ్ నుంచి వచ్చి కూడా తెలంగాణలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com