Minister Uttam Kumar Reddy : సింగూర్ డ్యామ్ కు కట్టుదిట్టమైన చర్యలు

సింగూర్ డ్యామ్ ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యామ్ లు,రిజర్వాయర్ లతో పాటు ఇతర జలాశయాలను నిత్యం పర్యవేకక్షించాలని ఆయన సూచించారు. ప్రమాదం అని భావించి ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్ తో పాటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ తో ఛత్తీస్ ఘడ్ పై చూపే ప్రభావాల పై ఐ ఐ టి ఖరగ్ పూర్ జరిపిన అధ్యయనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలంలోని తుపాకులగూడెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం తెలంగాణా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి బ్యారేజ్ నిర్మాణంతో ఛత్తీస్ ఘడ్ లో సుమారు 40 హెక్టార్లు ముంపు కు గురవుతుందని ఐ ఐ టి ఖరగ్ పూర్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. దీని ప్రభావం ఛత్తీస్ ఘడ్ లోని కోటూర్,తార్లగూడ,గంగారాం,కంబల్పేట లతో 10.9 చ.కి.మీ భూబాగం ముంపుకు గురౌతుందని అధ్యయనంలో తేలిందన్నారు. అయితే అదే సమయంలో ఈ బ్యారేజ్ ని పూర్తి చేసేందుకు గాను ఛత్తీస్ ఘడ్ తో సంప్రదించి అవసరమైన అనుమతులు తీసుకుంటామన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6.94 టి.యం.సి ల నీటితో 16.40 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.2017 లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2022 లో పూర్తి కావల్సి ఉండగా వివిధ కారణాలతో పనులలో జాప్యం జరిగిందన్నారు.ఛత్తీస్ ఘడ్ తో సంప్రదింపులు జరిపి త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com