TG : 11 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత : కిషన్ రెడ్డి

TG : 11 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత : కిషన్ రెడ్డి
X

11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇదే మాదిరిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలు తీశాయని సెంట్రల్ మినిస్టర్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై వర్క్షాప్ నిర్వహిం చారు. ఈసందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చే యాలన్నారు. సంస్థాగతంగా బీజేపీ బలోపేతం చే సుకోవాలన్నారు. ‘ కాంగ్రెస్ అప్పుల మీద అప్పులు తెస్తుంది. రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. మహిళ, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్ర జలకు న్యాయం జరిగేది బీజేపీ తోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపేననే గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తోంది, అంతకన్నా రెట్టింపు అప్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ గ్యారెంటీ ల గారడి ప్రజలు అర్ధం చేసుకు న్నారు' అని కిషన్రెడ్డి అన్నారు.

Tags

Next Story