MBBS Student : ఆదిలాబాద్ రిమ్స్‌లో విద్యార్థి సూసైడ్

MBBS Student : ఆదిలాబాద్ రిమ్స్‌లో విద్యార్థి సూసైడ్
X

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్‌‌లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాహిల్ చౌదరి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2023-24 బ్యాచ్‌కు చెందిన సాహిల్ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. రిమ్స్ బాయ్స్ హాస్టల్‌లో ఉండి ఎంబిబిఎస్ చదువుతున్న సాహిల్ తన హాస్టల్ గదిలో నుండి ఫ్రెండ్స్ బయటకు వెళ్లగానే ఉదయం 11 గంటలకు గదికి తలుపులు బిగించి ఫ్యాన్‌కు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే ఫ్రెండ్స్ సాహిల్‌ను ఐసీయూకి తరలించినప్పటికీ అప్పటికీ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా ఆగస్టు 2 నుండి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మానసిక ఒత్తిడి భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. అతని వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story