Minister KTR : అమెరికాలో విజయవంతంగా మంత్రి కేటీఆర్ టూర్

Minister KTR : అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కేటీఆర్. 2014 లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఎన్నారైలకు వివరించారు మంత్రి కేటీఆర్.ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్నారైలను కోరారాయన. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఏడేళ్ల క్రితం పసికూన లాంటి తెలంగాణను పరిచయం చేశానని... ఇప్పుడు అన్ని రంగాల్లో విజేతగా నిలిచిన తెలంగాణ సక్సెస్ స్టోరీని చెప్పడానికి మళ్లీ రావడం గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఇండియాలో ఎగురుతున్న ఏకైక గెలుపుపతాకం తెలంగాణ మాత్రమేన్నారు. స్వతంత్ర భారతంలో అత్యంత విజయం సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి కేటీఆర్.
భౌగోళికంగా దేశంలో 11 వ అతిపెద్ద రాష్ట్రమైన తెలంగాణ, జనాభాపరంగా 12 వ అతిపెద్ద రాష్ట్రమన్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశ ఆర్థిక వృద్ధిలో 4 వ అతిపెద్ద వాటాదారు తెలంగాణ అని అన్నారు మంత్రి కేటీఆర్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు సపోర్ట్ గా నిలుస్తోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com