Telangana : సమ్మర్ హాలీడేస్.. ఇంటర్ కాలేజీలు తెరుచుకునేది ఎప్పుడో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 30 నుంచి జూన్ 1 వరకు అన్ని ఇంటర్ కళాశాలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థలతో సహా అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ షెడ్యూల్ ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. తిరిగి కళాశాలలు జూన్ 2, 2025 పునః ప్రారంభ మవుతాయని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వేసవి సెలవులను విద్యార్ధులు తమ స్వీయ అధ్యయనం, నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగించు కోవాలని బోర్డు కోరింది. వేసవి సెలవుల్లో ఎవరైనా విద్యాసంస్థలు అనధికార తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే ఆసంస్థలపై బోర్డు మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చిరించింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం కావాలన్నా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొంది. ఇంటర్ పరీక్షల పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ పారదర్శకంగా మూల్యాంకన జరిగేలా క్యాంపు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com