TG : స్కూళ్లకు 24 నుంచి వేసవి సెలవులు

TG : స్కూళ్లకు 24 నుంచి వేసవి సెలవులు
X

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్, కార్పోరేట్, గురుకుల పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీలోగా నిరంతరం సమగ్ర మూల్యాంకన సీసీఈ ప్రక్రియ పూర్తి చేసి మార్కులను నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.

ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపుకు చేరు కోవడంతో ఏప్రిల్ 20లోపు మార్కులను నమోదు చేసి 21న ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను డౌన్లోడ్ చేసి పరిశీలించాలని పేర్కొంది. ఏప్రిల్ 23న అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేయా లని సూచించింది. అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరింది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 2025 వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.

Tags

Next Story