Supreme Court : కంచ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court : కంచ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

హెచ్‌సీయూ కంచ భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మ.3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దని సీఎస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచ గ‌‌‌‌‌‌‌‌చ్చిబౌలి గ్రామ స‌‌‌‌‌‌‌‌ర్వే నంబ‌‌‌‌‌‌‌‌ర్ 25లోని 400 ఎక‌‌‌‌‌‌‌‌రాల ప్రభుత్వ భూమి హ‌‌‌‌‌‌‌‌క్కుల‌‌‌‌‌‌‌‌ను టీజీఐఐసీకి బ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌లాయిస్తూ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి 2024 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంప‌‌‌‌‌‌‌‌ల్లి మండ‌‌‌‌‌‌‌‌ల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎక‌‌‌‌‌‌‌‌రాల భూమికి సంబంధించి పంచ‌‌‌‌‌‌‌‌నామా నిర్వహించి 2024 జులై 1న టీజీ ఐఐసీకి అప్పగించారు. అప్పటినుంచి ఆ 400 ఎక‌‌‌‌‌‌‌‌రాల భూమి ప్రభుత్వం స్వాధీనంలో ఉంది. కొన్ని మీడియాల్లో వ‌‌‌‌‌‌‌‌స్తున్నట్టు ఇందులో అట‌‌‌‌‌‌‌‌వీ భూమి లేదు. రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది.

Tags

Next Story