Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌‌.. సీబీఐ, ఈడీకి సుప్రీం నోటీసులు

Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌‌.. సీబీఐ, ఈడీకి సుప్రీం నోటీసులు
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై ఆమె తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గత ఐదు నెలలుగా ఆమె జైల్లో ఉన్నారని, మధ్యంతర బెయిల్‌కు అర్హురాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసింది.

సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది.

Tags

Next Story