Isha Foundation : ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట

Isha Foundation : ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట
X

ఈశా ఫౌండేషన్​కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్​పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. ఈశా ఫౌండేషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం..మద్రాసు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఇద్దరు యువతులతో సీజేఐ డీవై చంద్రచూడ్‌ వర్చువల్​గా మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని వారు సీజేఐకి చెప్పారు. ఈ క్రమంలో ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.

Tags

Next Story