Delhi Pollution : ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఫైర్

దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ విఫలం కావడంపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత పర్యవేక్షణ, వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎలాంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని, గతంలో కమిషన్ చెప్పినవన్నీ గాల్లో మాటలుగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం కమిషన్‌కు ఉందని సూచించింది. ‘‘పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా వేయలేదు. ప్రతి ఏటా ఈ సమస్యను చూస్తుంటే సీఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని తెలుస్తోంది. కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా చూపించండి. దిల్లీ ఎన్‌సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనిపిస్తోంది’’ అని సీఏక్యూఎంను సుప్రీం ధర్మాసనం నిలదీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com