Rains in Telangana : తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం.. ఐదురోజులు వర్షాలు

Rains in Telangana : తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం.. ఐదురోజులు వర్షాలు
X

రానున్న అయిదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకను ఆనుకొని తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనంపై నుంచి ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణను అనుకొని ఉన్న ఆగ్నేయ ఆరేబియా సముద్రం మీదుగా కేరళగుండా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు విస్తరించి ఉందని వివరించింది.

దీని ప్రభావంతో సోమవారం ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Tags

Next Story