TG : మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై సర్వే

X
By - Manikanta |11 Feb 2025 3:45 PM IST
మాజీ మంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ భూమిలో సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి 12 ఎకరాలు కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా కోర్టులో యాదగిరి, సత్తెమ్మలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వర్సిటీలో భూ సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లారు. వర్సిటీలో ఉన్న 12 ఎకరాల్లో సర్వే చేపట్టారు. మల్లారెడ్డికి వర్సిటీలో ఎంత భూమి ఉంది. ఎన్ని ఎకరాలు కబ్బా చేశారనే అంశాలపై అధికారులు లెక్కలు బయటకు తీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com