Malakpet : మలక్ పేటలో వివాహిత అనుమానాస్పద మృతి

Malakpet : మలక్ పేటలో వివాహిత అనుమానాస్పద మృతి
X

మలక్ పేట జమున టవర్స్ లో సంగం శిరీష అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుండెపోటుతో మహిళ మృతి చెందిందని ఆమె భర్త వినయ్ , అత్తమామలు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మృతురాలి పేరెంట్స్ హాస్పిటల్ కు వచ్చేలో గా అక్కడినుంచి డెడ్ బాడీని వారి స్వగ్రామం శ్రీశైలం సమీపంలో దోమలపెంటకు అంబు లెన్సులో తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో ఎవరికీ చెప్పకుండా డెడ్ బాడీని తరలిస్తుండటంపై అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు వెంటనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని సమీప హాస్పిటల్ కు పోస్టుమార్టం కోసం తరలించారు. చనిపోయిన మహిళ ఒంటిపై గాయాలు ఉండటం గమనించిన్నట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. శిరీషను కొట్టి హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారంటూ చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story