TG : నేటి నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’

TG : నేటి నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’
X

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం జరగనుంది. అబ్బాపురంలో మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘నా గ్రామం నా గౌరవం’ నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో జరిగే పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, వనమహోత్సవంలో ప్రజలు పాలుపంచుకోవాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలు బాగుంటేనే, తెలంగాణ బాగుంటుందని చెప్పారు. ఈ నెల 6న తాగునీటిని అందించే ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్‌, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెరువులను సంరక్షణ, కలుషితం కాకుండా చూడటం, 7న గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో మురుగా నీరు నిలువకుండా చర్యలు తీసుకోవడం, మురుగునీటి గుంతలను పూడ్చటం, 8న సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వీధి కుక్కలను యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌కు తరలించడం, ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్‌ బాల్స్‌ వేయడం, 9న శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యల చూపట్టడం, రోడ్లకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లను తీసేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే ప్రతి మంగళ, శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

Tags

Next Story