TG : డబ్బు అడిగాడని స్వీట్ షాప్ యజమానిపై దాడి

TG : డబ్బు అడిగాడని స్వీట్ షాప్ యజమానిపై దాడి
X

తీసుకున్న స్వీట్స్ కు డబ్బులు అడిగి నందుకు ఓ మహిళ యువకుడితో కలిసి షాపు యజమానిపై దాడి చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. గత రాత్రి ఓ మహిళ మోచి బజార్ లోని బాలాజీ స్వీట్ హౌస్ కు వెళ్లింది. స్వీట్స్ తీసుకున్న తర్వాత బిల్లు చెల్లించాలని యజమాని కోరగా ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు చూపింది. తనకు డబ్బులు రాలేదని యజమాని నిలదీయగా వెంట వచ్చిన యువకుడితో కలిసి దాడి చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు

Tags

Next Story