MLC Kavitha : బీసీ బిల్లుల ఆమోదానికి చొరువ తీసుకోండి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha : బీసీ బిల్లుల ఆమోదానికి చొరువ తీసుకోండి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
X

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గానూ తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లులను తర్వగా ఆమోదించేలా చొరువ తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి అథవాలే ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి చేస్తున్న బీసీ ఉద్యమం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించారు. అదే సమయంలో బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి చొరువ తీసుకోవాలని వినతి పత్రం అందించారు. తరతరాలుగా సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైనదని, అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారని, అందులో తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోందని, ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని వివరించారు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో రెండు వేర్వురు బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందని గుర్తు చేశారు. అయితే,రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపించి చాలా కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా ఆమోదముద్ర పడని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ కవిత... తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడానికి చొరువ తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రూప్ సింగ్, మరిపల్లి మాధవి, మహేందర్ ముదిరాజ్, మనోజ్ గౌడ్, యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివ శంకర్, కో- ఆర్డినేటర్ ఆలకుంట హరి, నాయకులు విజయేంద్ర సాగర్, మాధవ్ మేరు తదితరులు ఉన్నారు.

Tags

Next Story