TG : తులం బంగారం ఇవ్వాల్సిందే : తలసాని

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఎప్పుడిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని తహసీల్దార్ కార్యాలయంలోలబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడపడుచుల పెండ్లికి ఆర్థిక సహాయం అందించాలని నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ పథకాలతో ఎంతోమంది పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేందుకు అలవి కాని హామీలను ఇచ్చింది. తీరా గెలిచాక ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. అర్హులకు ఆర్థిక సహాయం అందించడంలో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com