TG : ముత్యాలమ్మ టెంపుల్‌లో తలసాని.. విగ్రహ ప్రతిష్ఠాపనపై చర్చ

TG : ముత్యాలమ్మ టెంపుల్‌లో తలసాని.. విగ్రహ ప్రతిష్ఠాపనపై చర్చ
X

సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని వేద పండితులు, స్థానికులతో కలిసి మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజిట్ చేశారు. విగ్రహ పునఃప్రతిష్ఠాపనపై స్థానికులతో చర్చించారు... విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజులపాటు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని తలసాని తెలిపారు. అమ్మవారి మూడున్నర అడుగుల రాతి విగ్రహాన్ని ప్రతిష్టించి 3 రోజుల పాటు కుంభాభిషేకం, శాంతి పూజా, యంత్ర స్థాపనతో అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బస్తీవాసులు, శివసత్తులు, జోగినీ లు ఇంటి నుంచి పసుపు, కుంకుమ, బోనాలతో నైవేద్యం సమర్పించి అమ్మవారి పూజల్లో పాల్గొంటారని తలసాని తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

Tags

Next Story